బీసీసీఐ దిగ్భ్రాంతి.. పిచ్‌ క్యూరేటర్‌పై వేటు..! | Pune pitch curator to be be suspended | Sakshi
Sakshi News home page

Oct 25 2017 11:53 AM | Updated on Oct 25 2017 1:36 PM

Pune pitch curator to be be suspended

పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్‌ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్‌ కుంభకోణం నేపథ్యంలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఉత్కంఠ రేపగా.. మ్యాచ్‌ యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి.  పిచ్‌ను బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లకు చూపించి.. పిచ్‌ వివరాలు వెల్లడించిన క్యూరేటర్‌ పాండురంగ్‌ సల్గావుంకర్‌ మైదానంలోకి అడుగుపెట్టకుండా బీసీసీఐ బహిష్కరించింది. పిచ్‌ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యూరేటర్‌ను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది.

'ఇలాంటి విషయాలను బీసీసీఐ ఎంతమాత్రం ఉపేక్షించదు. అసలు పూర్తిగా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని సత్వరమే చర్యలు తీసుకుంటాను. బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు' అని బీసీసీఐ జాయింట్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్‌ కమిటీ (సీఏవో) కూడా స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో బాధ్యులను వదలబోమని సీఏవో చీఫ్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. స్టింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు.

దేశంలో పాపులర్‌ అయిన క్రికెట్‌ క్రీడలో అవినీతిని ఎంతమాత్రం ఉపేక్షించబోనంటూ బీసీసీఐ కఠినమైన నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీంకోర్టు సైతం బీసీఐఐలో ప్రక్షాళన కోసం కీలక చర్యలు తీసుకుంది. మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌ నేపథ్యంలో  అడ్మినిస్ట్రేటర్స్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో పిచ్‌లో మార్పులకు సిద్ధమంటూ బుకీలకు చెప్పడమే కాకుండా.. బుకీలను మైదానంలోకి స్వయంగా పిచ్‌ను చూపించిన ఎంసీఏ క్యూరేటర్‌ పాండురంగ్‌ సల్గావుంకర్‌ వ్యవహారం బీసీసీఐలో కలకలం రేపుతోంది. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పిచ్‌ కుంభకోణంపై వ్యవహారంపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి క్యూరేటర్లపై జీవితకాల నిషేధం విధించాలని మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement