టైటిల్‌పోరుకు ప్రాంజల జోడి | Pranjula pair enter final of ITF tourney | Sakshi
Sakshi News home page

టైటిల్‌పోరుకు ప్రాంజల జోడి

Sep 15 2017 10:43 AM | Updated on Sep 19 2017 4:36 PM

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ ఫైనల్‌కు చేరుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లో గురువారం జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో ప్రాంజల– జీల్‌ దేశాయ్‌ (భారత్‌) ద్వయం 6–2, 6–4తో కావో సికి– లి యువాన్‌ (చైనా) జంటపై గెలుపొందింది. ఫైనల్లో ప్రాంజల జోడీ భారత్‌కు చెందిన రితుజ భోస్లే– అలెగ్జాండ్రా వాల్టర్‌ (అమెరికా) జంటతో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement