ప్రణయ్‌ ముందంజ | pranai enter to quarter-final | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ ముందంజ

Mar 16 2017 12:03 AM | Updated on Sep 5 2017 6:10 AM

ప్రణయ్‌ ముందంజ

ప్రణయ్‌ ముందంజ

డిఫెండింగ్‌ చాంపియన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (భారత్‌) స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): డిఫెండింగ్‌ చాంపియన్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (భారత్‌) స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఐదో సీడ్‌ ప్రణయ్‌ 21–17, 21–19తో కిరాన్‌ మెరిలిస్‌ (స్కాట్లాండ్‌)పై గెలిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పదో సీడ్‌ కియావో బిన్‌ (చైనా)తో ప్రణయ్‌ ఆడతాడు.

మరోవైపు భారత్‌కే చెందిన సమీర్‌ వర్మ రెండో రౌండ్‌లో 21–16, 15–21, 13–21తో కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో ఓడిపోగా... శుభాంకర్‌ డే 21–17, 21–18తో ఉత్రోసా (స్లొవేనియా)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంటకు తొలి రౌండ్‌లో వాకోవర్‌ లభించింది.  మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 8–21తో ఏడో సీడ్‌ ఫిత్రియాని (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement