సెమీస్‌లో ప్రజ్నేశ్‌ | Prajnesh and Sasi Kumar enter in semi Final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ప్రజ్నేశ్‌

Feb 9 2019 3:09 AM | Updated on Feb 9 2019 10:14 AM

Prajnesh and  Sasi Kumar enter in semi Final - Sakshi

చెన్నై: సొంతగడ్డపై నిలకడగా ఆడుతున్న భారత టెన్నిస్‌ ఆటగాళ్లు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, శశికుమార్‌ ముకుంద్‌ చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ ప్రజ్నేశ్‌ 6–4, 6–3తో జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై, శశికుమార్‌ 6–2, 3–6, 7–6 (7/3)తో బ్రైడెన్‌ క్లీన్‌ (బ్రిటన్‌)పై గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కొరెన్‌టిన్‌ ముటెట్‌ (ఫ్రాన్స్‌)తో శశికుమార్‌; ఆండ్రూ హారిస్‌ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్‌ తలపడతారు.  

Advertisement
 
Advertisement
Advertisement