breaking news
Open ATP Challenger Tennis
-
సెమీస్‌లో ప్రజ్నేశ్
చెన్నై: సొంతగడ్డపై నిలకడగా ఆడుతున్న భారత టెన్నిస్ ఆటగాళ్లు ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ 6–4, 6–3తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, శశికుమార్ 6–2, 3–6, 7–6 (7/3)తో బ్రైడెన్ క్లీన్ (బ్రిటన్)పై గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)తో శశికుమార్; ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్ తలపడతారు. -
సాకేత్ శుభారంభం
వియత్నాం ఓపెన్ టోర్నీ హో చి మిన్ సిటీ: భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. అయితే భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సుమీత్ నాగల్, జీవన్ నెదున్‌చెజియాన్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 7-6 (7/3)తో గెరార్డ్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచాడు. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన అతను ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ 6-7 (4/7), 6-3, 6-2తో లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) చేతిలో; సుమీత్ 0-6, 7-6 (7/2), 1-6తో అడ్రియన్ మెనెన్‌దెజ్ (స్పెయిన్) చేతిలో; జీవన్ 2-6, 2-6తో హిరోయాసు ఇహరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో సనమ్ సింగ్ 1-6, 6-3, 6-4తో జెర్మెన్ (జర్మనీ)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు.