సాకేత్ శుభారంభం | Open ATP Challenger Tennis Tournament | Sakshi
Sakshi News home page

సాకేత్ శుభారంభం

Oct 14 2015 12:59 AM | Updated on Sep 3 2017 10:54 AM

భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు.

వియత్నాం ఓపెన్ టోర్నీ
 హో చి మిన్ సిటీ: భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. అయితే భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సుమీత్ నాగల్, జీవన్ నెదున్‌చెజియాన్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 7-6 (7/3)తో గెరార్డ్ గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచాడు.

గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన అతను ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ 6-7 (4/7), 6-3, 6-2తో లూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) చేతిలో; సుమీత్ 0-6, 7-6 (7/2), 1-6తో అడ్రియన్ మెనెన్‌దెజ్ (స్పెయిన్) చేతిలో; జీవన్ 2-6, 2-6తో హిరోయాసు ఇహరా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో సనమ్ సింగ్ 1-6, 6-3, 6-4తో జెర్మెన్ (జర్మనీ)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement