ప్రజ్నేశ్‌ ముందంజ | Prajnesh loses in Kazakhstan Challenger semifinals | Sakshi
Sakshi News home page

ప్రజ్నేశ్‌ ముందంజ

Mar 6 2021 5:57 AM | Updated on Mar 6 2021 5:57 AM

Prajnesh loses in Kazakhstan Challenger semifinals - Sakshi

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 134వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ 6–4, 2–6, 7–6 (7/1)తో ప్రపంచ 102వ ర్యాంకర్‌ జేమ్స్‌ డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్నేశ్‌ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్‌ థామస్‌ మచాక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement