Davis Cup 2022 India Vs Norway: Casper Ruud Beats Prajnesh Gunneswaran - Sakshi
Sakshi News home page

Davis Cup 2022: తొలి సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ పరాజయం

Sep 17 2022 4:49 AM | Updated on Sep 17 2022 9:26 AM

Davis Cup 2022: Davis Cup: Casper Ruud beats Prajnesh Gunneswaran - Sakshi

లిల్లీహ్యామర్‌ (నార్వే): డేవిస్‌కప్‌ టీమ్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 335వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు.

కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో 23 ఏళ్ల కాస్పర్‌ రూడ్‌ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్‌ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ నాలుగు ఏస్‌లు సంధించినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్‌ విక్టర్‌ దురాసోవిచ్, రామ్‌కుమార్‌ రామనాథన్‌ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్‌ మ్యాచ్‌తోపాటు రెండు రివర్స్‌ సింగిల్స్‌ జరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement