వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న ఆస్ట్రేలియా ఇక ఆశలు .........
♦ ఆసీస్, విండీస్ మూడో టెస్టు
సిడ్నీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న ఆస్ట్రేలియా ఇక ఆశలు వదులుకోవాల్సిందేమో.. రెండో రోజు కనీసం 11.2 ఓవర్ల ఆట సాధ్యమైనా మంగళవారం మూడో రోజు ఆట మాత్రం పూర్తిగా వర్షార్పణమైంది. ఇప్పటికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 86.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 248 పరుగులతో ఉంది. ఇక ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండగా బుధవారం కూడా చిరు జల్లులు కురిసే అవకాశముంది. గత 20 ఏళ్లలో ఆసీస్ గడ్డపై ఓ టెస్టులో రోజు మొత్తం ఆట వర్షం కారణంగా రద్దు కావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో ఉంది.