పిస్టోరియస్‌పై హత్యా నేరం | Pistoriyaspai murder charge | Sakshi
Sakshi News home page

పిస్టోరియస్‌పై హత్యా నేరం

Aug 20 2013 2:44 AM | Updated on Jul 30 2018 8:27 PM

పిస్టోరియస్‌పై హత్యా నేరం - Sakshi

పిస్టోరియస్‌పై హత్యా నేరం

దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రియురాలిని హత్య చేయడమే కాకుండా, చట్ట విరుద్ధంగా ఆయుధాలు కలిగినట్టు పోలీసులు అభియోగం మోపారు. గత ఫిబ్రవరి 14న ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను తుపాకితో కాల్చినట్టు ఈ 26 ఏళ్ల బ్లేడ్ రన్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంట్లోకి ఆగంతకులు వచ్చినట్టు భావించి తుపాకీ పేల్చగా అది రీవాకు తగిలినట్టు ఆస్కార్ వాదిస్తున్నాడు.

 ప్రిటోరియా: దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రియురాలిని హత్య చేయడమే కాకుండా, చట్ట విరుద్ధంగా ఆయుధాలు కలిగినట్టు పోలీసులు అభియోగం మోపారు. గత ఫిబ్రవరి 14న ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను తుపాకితో కాల్చినట్టు ఈ 26 ఏళ్ల బ్లేడ్ రన్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంట్లోకి ఆగంతకులు వచ్చినట్టు భావించి తుపాకీ పేల్చగా అది రీవాకు తగిలినట్టు ఆస్కార్ వాదిస్తున్నాడు.
 
 అయితే ఈ కేసు విషయంలో గత ఆరు నెలలుగా డిటె క్టివ్స్, ఫోరెన్సిక్ నిపుణులు, బాలిస్టిక్ నిపుణులు, సైకాలజిస్టులు, సాంకేతిక నిపుణులు పనిచేశారని... పిస్టోరియస్ దోషిగా తేలుతాడని తాము నమ్ముతున్నట్టు దక్షిణాఫ్రికా జాతీయ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పిస్టోరియస్ విచారణ ప్రారంభానికి ముందు చేతులు ముఖానికి కప్పుకుని విలపిస్తూ కనిపించాడు. సోమవారం రీవా 30వ జన్మదినం కావడం విశేషం. దక్షిణాఫ్రికాలో మరణ శిక్ష అమల్లో లేని కారణంగా ఒకవేళ పిస్టోరియస్ దోషిగా తేలితే గరిష్టంగా 25 ఏళ్లు శిక్ష పడుతుంది

Advertisement
 
Advertisement
Advertisement