పీటర్సన్ ఆశలు ఆవిరి | Peterson hopes Steam | Sakshi
Sakshi News home page

పీటర్సన్ ఆశలు ఆవిరి

May 13 2015 1:17 AM | Updated on Sep 3 2017 1:54 AM

ఎలాగైనా తిరిగి ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలన్నది కెవిన్ పీటర్సన్ లక్ష్యం. ఇందుకోసం ఐపీఎల్ వదిలేసుకున్నాడు.

ఇంగ్లండ్ జట్టులో దక్కని చోటు 
కెవిన్‌ను నమ్మలేమన్న స్ట్రాస్


లండన్ : ఎలాగైనా తిరిగి ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలన్నది కెవిన్ పీటర్సన్ లక్ష్యం. ఇందుకోసం ఐపీఎల్ వదిలేసుకున్నాడు. కౌంటీల్లో కసిగా ఆడాడు. ఓ ఆటగాడిగా ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇకపై అందరితోనూ స్నేహంగా ఉంటానని హామీ ఇచ్చాడు. అయినాగానీ అతనికి  ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కలేదు.

కెవిన్‌ను నమ్మలేమని, జట్టులోకి రావాలంటే ముందు సహచరుల నమ్మకాన్ని గెలవాలని ఇంగ్లండ్ జట్టు కొత్త కోచ్ ఆండ్రూ స్ట్రాస్ అన్నాడు. 2013లో స్ట్రాస్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా పీటర్సన్... స్ట్రాస్ గురించి ప్రత్యర్థి క్రికెటర్లకు సందేశాలు పంపించాడు. దీంతో అతణ్ని జట్టు నుంచి తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement