సెమీస్‌లో కశ్యప్‌ | Parupalli Kashyap Enters Semi Finals Of Korea Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో కశ్యప్‌

Sep 28 2019 4:23 AM | Updated on Sep 28 2019 4:23 AM

Parupalli Kashyap Enters Semi Finals Of Korea Open - Sakshi

ఇంచియోన్‌ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ జోరు కొనసాగుతోంది. సహచర భారత స్టార్‌ షట్లర్లు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగినా... పతకం ఆశలను సజీవంగా ఉంచుతూ కశ్యప్‌ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.  శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ పోరులో కశ్యప్‌ 24–22, 21–8తో జాన్‌ ఒ జార్గెన్‌సెన్‌ (డెన్మార్క్‌)ను చిత్తుచేశాడు. నేటి సెమీస్‌ పోరులో కశ్యప్‌ ప్రపంచ నంబర్‌ వన్‌  కెంటో మొమాటా (జపాన్‌)తో తలపడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement