
పాకిస్తాన్ జట్టు
క్వీన్స్‌టౌన్: అండర్–19 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు మూడో స్థానంతో సంతృప్తి పడింది. సెమీస్‌లో ఓడిన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య మూడో స్థానం కోసం గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో గ్రూప్ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు.
దీంతో పాకిస్తాన్ మూడో స్థానంలో, అఫ్గానిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచాయి. అండర్–19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2014లో ఆ జట్టు అత్యుత్తమంగా ఏడో స్థానం సంపాదించింది.