పాక్‌ కెప్టెన్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌ | Pakistan Loss Sarfraz Ahmed Wicket | Sakshi
Sakshi News home page

Sep 23 2018 7:47 PM | Updated on Sep 23 2018 7:49 PM

Pakistan Loss Sarfraz Ahmed Wicket - Sakshi

దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్‌ ఉల్‌ హక్‌(10), ఫకార్‌ జమాన్‌(31)లను పెవిలియన్‌కు చేర్చారు. ఆ వెంటనే బాబర్‌ ఆజమ్‌(9) సమన్వయలోపంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది.

ఆదుకున్న మాలిక్‌- సర్ఫరాజ్‌..
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్‌, సర్ఫరాజ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్‌ చక్కటి బంతితో సర్ఫరాజ్‌ (44)ను ఔట్‌ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అసిఫ్‌ అలీతో షోయబ్‌ మాలిక్‌ (73 నాటౌట్‌) పోరాడుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement