
మొహమ్మద్ జరియబ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఆమిర్ హనీఫ్ కుమారుడు మొహమ్మద్ జరియబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక అండర్–19 జట్టులో ఎంపిక కాలేకపోయాననే మనస్థాపంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత జనవరిలో జరియబ్ కరాచీ అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి లాహోర్‌లో జరిగిన ఓ టోర్నీలో పాల్గొన్నాడు. అయితే గాయపడ్డాడనే కారణంతో అతడిని టోర్నీ మధ్యలోనే ఇంటికి పంపించారు.
మళ్లీ జట్టులోకి ఎంపిక చేస్తామని ఆ సమయంలో చెప్పినా ఓవర్‌ఏజ్ కారణంగా జరియబ్ పేరును సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ‘అండర్–19 జట్టులో అర్హత ఉన్నా వయసు పైబడిందని కోచ్‌లు, సెలెక్టర్లు నిరాకరించడంతోనే నా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని హనీఫ్ ఆరోపించారు. హనీఫ్ 1990 దశకంలో పాక్ వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదు మ్యాచ్‌లు ఆడారు.