ఓయూ టీటీ జట్టుకు టైటిల్‌ | OU wins table tennis title | Sakshi
Sakshi News home page

ఓయూ టీటీ జట్టుకు టైటిల్‌

Dec 31 2017 10:49 AM | Updated on Dec 31 2017 10:49 AM

OU wins table tennis title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

శనివారం జరిగిన ఫైనల్లో ఉస్మానియా జట్టు 3–1తో మద్రాస్‌ యూనివర్సిటీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఉస్మానియా 3–0తో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీపై గెలుపొందగా, మద్రాస్‌ యూనివర్సిటీ 3–0తో కాలికట్‌ జట్టును ఓడించింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో ఓయూ 3–0తో ఆర్‌జీయూహెచ్‌ఎస్‌ కర్ణాటకపై, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3–1తో అన్నా యూనివర్సిటీపై, కాలికట్‌ 3–0తో ఎంజీ యూనివర్సిటీపై, మద్రాస్‌ యూనివర్సిటీ 3–1తో కేరళపై విజయం సాధించాయి.

Advertisement
 
Advertisement
Advertisement