జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 4 వికెట్ల తేడాతో హెడ్‌ఆఫీస్‌పై నెగ్గింది. అంబర్‌పేట మైదానంలో శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్
జింఖానా, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు 4 వికెట్ల తేడాతో హెడ్‌ఆఫీస్‌పై నెగ్గింది. అంబర్‌పేట మైదానంలో శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
రాజారామ్ 23, న ర్సింగ్ రావు 22 పరుగులు చేశారు. ఆదిల్ 3, కార్తీక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన నార్త్ జోన్ 14.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కార్తీక్ (35), కిరణ్ కుమార్ (26), గోవర్ధన్ రెడ్డి (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్ బౌలర్లు దయానంద్, రఘు చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.