‘కోహ్లి అభ్యర్థనపై ఇప్పుడే ఏమీ చెప్పలేం’

No Decision Yet On Virat Kohlis Request To Allow Wives On Overseas Tours - Sakshi

న్యూఢిల్లీ: భారత జట్టు విదేశీ సిరీస్‌ల కోసం వెళ్లినపుడు పర్యటన మొత్తం ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేలా అనుమతించాలంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన అభ్యర్థనపై ఉన్నపళంగా ఓ నిర్ణయానికి రాలేమని క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) చెప్పింది. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతిస్తున్నారు. ‘దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోలేం. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేశాం’ అని సీఓఏ ప్రతినిధి తెలిపారు.

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని బీసీసీఐని కోహ్లి కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ పాలసీని మార్చాలని కోహ్లి తొలుత ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. అతను వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి చెప్పారు.దీనిపై సీఓఏ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

టూర్‌ మొత్తం భార్యలను అనుమతించండి: కోహ్లి

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top