అవార్డు రేస్‌లో నెయ్‌మార్ | Neymar nominated for one of FIFA’s World Cup awards | Sakshi
Sakshi News home page

అవార్డు రేస్‌లో నెయ్‌మార్

Jul 13 2014 1:27 AM | Updated on Oct 22 2018 5:58 PM

గాయం కారణంగా ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లకు దూరమైన బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్.. ఈ ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాళ్ల జాబితాలో పేరు దక్కించుకున్నాడు.

రియో డి జనీరో: గాయం కారణంగా ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లకు దూరమైన బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్.. ఈ ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాళ్ల జాబితాలో పేరు దక్కించుకున్నాడు. శుక్రవారం ఫిఫా ఈ ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది. నాలుగు గోల్స్ సాధించిన నెయ్‌మార్‌తో పాటు అర్జెంటీనా నుంచి మెస్సీ, జేవియర్ మస్కెరానో, డి మారియా కూడా జాబితాలో ఉన్నారు.
 
 అలాగే జర్మనీ నుంచి కెప్టెన్ ఫిలిప్ లామ్, థామస్ ముల్లర్, టోనీ క్రూస్, మాట్స్ హమ్మెల్, అర్జెన్ రాబెన్ (నెదర్లాండ్స్), జేమ్స్ రోడ్రిగేజ్(కొలంబియా) ఉన్నారు. వీరిలో ఒకరికి ఉత్తమ ఆటగాడు అవార్డు దక్కుతుంది. గోల్డెన్‌బాల్ రేసులో జేమ్స్ రోడ్రిగేజ్ అందరికంటే ఎక్కువగా ఆరు గోల్స్‌తో ముందున్నాడు. క్రితం సారి ఈ అవార్డును ఉరుగ్వే ఆటగాడు డీగో ఫోర్లాన్ గెలుచుకున్నాడు. టాప్ గోల్ కీపర్ రేసులో నవాస్ (కోస్టారికా), మాన్యువల్ న్యూర్ (జర్మనీ), సెర్గియో రొమెరో (అర్జెంటీనా) ఉన్నారు. ఉత్తమ యువ ఆటగాడి కోసం డిపే (హాలెండ్), పోగ్బా, వరానే (ఫ్రాన్స్) పోటీ పడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement