‘డచ్’ను ఆపతరమా... | Netherlands vs Mexico: Dutch squad promised free trip into space if they win the 2014 World Cup | Sakshi
Sakshi News home page

‘డచ్’ను ఆపతరమా...

Jun 29 2014 2:11 AM | Updated on Oct 22 2018 5:58 PM

‘డచ్’ను ఆపతరమా... - Sakshi

‘డచ్’ను ఆపతరమా...

లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

నెదర్లాండ్స్‌తో మెక్సికో ‘ఢీ’
 లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన నెదర్లాండ్స్ ప్రిక్వార్టర్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌ను గడగడలాడించిన వెటరన్ ఆటగాళ్లు రాబెన్,  పెర్సీ, డివ్రిజ్‌లతో పాటు మెంఫిస్, స్నిజ్దెర్ కీలకం కానున్నాడు. క్రితంసారి రన్నరప్‌తో సరి పెట్టుకున్న ‘డచ్’ ఈసారి ట్రోఫీపై గురి పెట్టింది.
 
 గత 28 ఏళ్లుగా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయిన మెక్సికోకు ఇదో మంచి అవకాశం. పక్కా ప్రణాళికలతో ఆడిన మెక్సికో లీగ్ దశలో ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ కీపర్ ఓకో ప్రదర్శన సూపర్బ్. గర్డాడో, మర్క్వెజ్, హెర్నాండేజ్, పెరాల్టాలు నమ్మదగిన ఆటగాళ్లు.  
 
 ఇప్పటి వరకు నెదర్లాండ్స్, మెక్సికోలు ముఖాముఖిగా ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. మూడింటిలో నెగ్గిన నెదర్లాండ్స్, రెండింటిలో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓవరాల్‌గా రెండు జట్లు చెరో 11 గోల్స్ నమోదు చేశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement