సెమీస్‌కు చేరిన సైనా, కశ్యప్‌ | Nehwal, Kashyap enter semifinals of Senior Nationals | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు చేరిన సైనా, కశ్యప్‌

Feb 15 2019 2:06 PM | Updated on Feb 15 2019 2:06 PM

Nehwal, Kashyap enter semifinals of Senior Nationals - Sakshi

గువాహటి: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌లోకి ప‍్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా 21-10, 21-10 తేడాతో భారత మాజీ నంబర్‌ వన్‌ నేహా పండిట్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో సైనా ఆద్యంతం దూకుడుగా ఆడారు. సెమీ ఫైనల్లో వైష్ణవితో సైనా తలపడనున్నారు.

ఇక పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. కశ్యప్‌ 21-18, 21-16 తేడాతో బొద్దిహిత్‌ జోషిపై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. సౌరవ్‌ వర్మ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్లో సౌరవ్‌ 21-11, 21-23, 21-18తో సాయి ప్రణీత్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement