నాగిని డ్యాన్స్‌ చేస్తే.. నాదస్వరం ఊదుతా! | Mushfiqur Rahim gets send off with nadaswaram by Aponso | Sakshi
Sakshi News home page

నాగిని డ్యాన్స్‌ చేస్తే.. నాదస్వరం ఊదుతా!

Mar 17 2018 1:13 PM | Updated on Nov 9 2018 6:46 PM

Mushfiqur Rahim gets send off with nadaswaram by Aponso - Sakshi

శ్రీలంక బౌలర్‌ అపోన్సో

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ నాగిని డ్యాన్స్‌ చేసి అలరించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ విజయం సాధించిన తర్వాత ముష్పికర్‌ నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన చివరిదైన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ముష్పికర్‌ రహీమ్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.

అపోన్స్‌ వేసిన 13 ఓవర్‌ మూడో బంతికి తిషారా పెరీరా చక్కటి క్యాచ్‌ పట్టడంతో రహీమ్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు. దాంతో బౌలర్‌ అపోన్సో మాత్రం నాదస్వరం ఊది రహీమ్‌కు సెండాఫ్‌ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో బంగ్లా గెలిచిన తర్వాత ముష్పికర్‌ నాగిన డ్యాన్స్‌ చేస్తే దానికి ఇప్పుడు అపోన్సో ఇలా సమాధానమిచ్చాడు. ' నువ్వు నాగిన డ్యాన్స్‌ చేస్తే.. నేను నాదస్వరం ఊదుతా' అనే అర్థం వచ్చేలా అపోన్సో స్లెడ్జ్‌ చేశాడు. ఇరు జట్ల మధ్య చివరి వరకూ ఉత‍్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ రెండు వికెట్ల తేడాతో గెలిచి భారత్‌తో తుది పోరుకు సిద్ధమైంది.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement