ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్ | Muralitharan in the ICC Cricket Hall of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్

Jul 28 2016 1:01 AM | Updated on Sep 4 2017 6:35 AM

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో మురళీధరన్

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది.

దుబాయ్: శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఐసీసీ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ ఘనత సాధించాడు.


ఆస్ట్రేలియా మహిళల క్రి కెట్ జట్టు కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement