భారత్ - బంగ్లా టెస్ట్: విజయ్ సెంచరీ | murali vijay mede his 6th century | Sakshi
Sakshi News home page

భారత్ - బంగ్లా టెస్ట్: విజయ్ సెంచరీ

Jun 12 2015 9:44 AM | Updated on Sep 3 2017 3:38 AM

భారత్ - బంగ్లా టెస్ట్: విజయ్ సెంచరీ

భారత్ - బంగ్లా టెస్ట్: విజయ్ సెంచరీ

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(103, 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేశాడు.

ఫతుల్లా : బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(103, 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేశాడు. 201 బంతుల్లో తన కెరీర్ లో ఆరో టెస్టు సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్(106 నాటౌట్), శిఖర్ ధావన్ (166 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 65 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 239 పరుగులతో  శిఖర్ ధావన్ (150 బ్యాటిం గ్), మురళీ విజయ్ (89 బ్యాటింగ్) మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు గురువారం ఆట పూర్తిగా రద్దయిన విషయం తెలసిందే.

Advertisement
 
Advertisement
Advertisement