breaking news
India - Bangladesh
-
Satarupa Majumdar: బాల్యం చిగురించింది
ఆమె పేరు శతరూప మజుందార్. కోల్‌కతాలో టీచర్. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక పెద్ద మార్పునకు బీజం అయింది. ఆ మార్పు ఆమె జీవితానికి కాదు. పదిహేడు వందల మంది పిల్లల జీవితాల్లో మార్పుకు కారణమైంది. మోడువారిన బాల్యం కొత్త చిగుళ్లు సంతరించుకుంది. శతరూప కుటుంబానికి వారమంతా పని చేయడం, వారాంతంలో సమీపంలో ఉన్న ప్రదేశానికి చిన్న టూర్ వెళ్లడం అలవాటు. అలా ఆమె 2012లో వెస్ట్ బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు టూర్వెళ్లింది. ఇది ఒక దీవి. భారత్– బంగ్లాదేశ్‌ల సరిహద్దులో ఇచ్చామతి నది మధ్యలో ఉంది. అక్కడి పిల్లలను చూసినపుడు తీవ్రంగా మనసు కలచి వేసింది. భోజనానికి బడి దాదాపుగా ఏడాది పొడవునా వర్షాలు, వరదలతో సతమతమయ్యే ప్రాంతం అది. ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతుంది కాబట్టి పిల్లలు స్కూలుకెళ్తారు. అయితే వాళ్లు బడిలో ఉండేది మధ్యాహ్నం భోజనం చేసే వరకే. ఆ తర్వాత మురికిగుంటల్లో ఆటలకు వెళ్లిపోతారు. బడిలో ఉండమని పిల్లల్ని కట్టడి చేయాల్సిన, అవసరమైతే మందలించాల్సిన బాధ్యతను గురువులు మర్చిపోతారు. వాళ్లను కన్నవాళ్లు బడికి పంపాల్సిన బాధ్యత ఎరిగిన వాళ్లు కాదు. చేపలు పట్టడం, బీడీలు చుట్టడం, వ్యవసాయ కూలిపనులతో కడుపు నింపుకోవడమే భారంగా ఉండే జీవితాలవి. ఈ నేపథ్యంలో సాగిన బడి ప్రస్థానం ఏ పిల్లలనైనా ఫెయిల్ చేసి తీరుతుంది. ఫెయిలైన తర్వాత ఏడాది బడిలో పేరు ఉండదు. పేరు లేదు కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఉండదు. పిల్లలు బడి ముఖం కూడా చూడరు. ఇక ఆ పిల్లల బాల్యం పువ్వులా ఎలా విచ్చుకుంటుంది? బడిమానేసిన పిల్లలు పెద్దవాళ్లతోపాటు బీడీలు చుట్టడంలో మునిగిపోతారు. అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు బీడీలను అల్లుతుంటే చూడలేకపోయింది శతరూప. ఆ పిల్లలందరూ తన ఆరేళ్ల కూతురి వయసుకి కొంచెం అటూఇటూగా ఉన్నవాళ్లే. తన కూతురు పెరుగుతున్న వాతావరణానికీ– ఈ పిల్లలు పెరుగుతున్న వాతావరణానికీ ఎక్కడా పోలికే లేదు. పేదరికం పెనం మీద అట్టుడికి పోతున్న బాల్యం వాళ్లది. అందమైన బాల్యం పిల్లలు హక్కు. ఆ హక్కు నిరభ్యంతరంగా నేలరాయబడుతోందక్కడ. ‘స్వతంత్ర భారతంలో పాలకులు ఇన్నేళ్లపాటు వాళ్లకు అందించిన సౌకర్యాలేమిటి’ అనే ప్రశ్న మదిలో ఉదయిస్తుంది. కానీ సమాధానం చెప్పేవాళ్లే ఉండరు. అయితే శతరూప సమాధానం కోసం చూడలేదు. తనే ఒక సమాధానం కావాలనుకుంది. మర్చిపోలేదామె! ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు చాలామంది మనసు కకావికలమవుతుంది. కానీ టూర్ ముగించుకుని నగరానికి వెళ్లిన వెంటనే రొటీన్లో పడి మర్చిపోవడమూ జరుగుతుంది. అయితే శతరూప విషయంలో అలా జరగలేదు. హింగల్గంజ్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన తర్వాత కూడా తాను చూసిన దృశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే స్వప్నోఫూరోన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించింది. ‘స్వప్నోఫూరోన్’ పేరుతో సుందర్బన్లో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూలు పెట్టింది శతరూప. స్వప్నోపురోన్ అంటే ‘కల నిజమాయె’ అని అర్థం. ఆ తర్వాత మరో ఐదు దీవుల్లో పాఠశాలలను తెరిచింది. ఈ పదేళ్లలో ఆ పాఠశాలలు పదిహేడు వందల బాల్యాలను గాడిలో పెట్టాయి. అచ్చమైన, అందమైన బాల్యాన్ని ఆస్వాదిస్తూ పెరుగుతున్నారా పిల్లలు. -
రహానే హాఫ్ సెంచరీ, భారత్ 398/3
ఫతుల్లా : బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్య రహానే అర్ధశతకం చేశాడు. మూడో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి 93 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. రహానే 64 బంతుల్లోనే 6 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. 2013లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఉపఖండం లోపల రహానేకిది తొలిటెస్ట్. గతంలో అతడు ఆసియా వెలుపల 13 టెస్టులు ఆడాడు. గత 12 నెలల వ్యవధిలో టెస్టుల్లో 1000 పరుగులు చేసిన ఏకైక భారత్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్. అతని తర్వాత కోహ్లీ 840 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ (144 నాటౌట్), రహానే (55 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కు మురళీ విజయ్‌తో అభేద్యమైన 283 పరుగులు జోడించాక ఓపెనర్శిఖర్ ధావన్(174) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్ షకీబ్ అల్ అసన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (6) పరుగులు చేసి షకీబ్ ఓవర్లనే ఔటయ్యాడు. దూకుడుగా ఆడే యత్నంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(14, 2 ఫోర్లు) జుబేర్ హుస్సెన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ రెండు వికెట్లు పడగొట్టగా, జుబేర్ హుస్సెన్ ఒక వికెట్ తీశాడు. -
భారత్ - బంగ్లా టెస్ట్: విజయ్ సెంచరీ
ఫతుల్లా : బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్(103, 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ చేశాడు. 201 బంతుల్లో తన కెరీర్ లో ఆరో టెస్టు సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్(106 నాటౌట్), శిఖర్ ధావన్ (166 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 65 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ నష్టపోకుండా 239 పరుగులతో శిఖర్ ధావన్ (150 బ్యాటిం గ్), మురళీ విజయ్ (89 బ్యాటింగ్) మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు గురువారం ఆట పూర్తిగా రద్దయిన విషయం తెలసిందే.