అదే ధోనికి చివరి చాన్స్‌ కావొచ్చు..

MS Dhoni Will Get One Last Chance,Keshav Ranjan - Sakshi

న్యూఢిల్లీ:  మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భారత జట్టులోకి రావడం ఇక కష్టమేనని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడగా, అతని చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ రంజాన్‌ బెనర్జీ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టులో  ధోని తిరిగి చోటు దక్కించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని, కానీ చివరగా ఒక్క చాన్స్‌ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. ఐపీఎల్‌తో తిరిగి సత్తా చాటుకుని జట్టులోకి రావాలని చూసిన ధోనికి నిరాశే ఎదురైంది. ఐపీఎల్‌ కోసం ముందుగానే ప్రాక్టీస్‌ మొదలు పెట్టేసినా ఆ లీగ్‌ వాయిదా పడటంతో ధోని ఆశలు తీరేలా కనబడుటం లేదు. 

అసలు ఐపీఎల్‌ జరుగుతుందనే విషయంపై కూడా క్లారిటీ లేదు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపైనే ధోని చిన్ననాటి కోచ్‌ రంజాన్‌ బెనర్జీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌తో భారత జట్టులో తిరిగి రావాలని ధోని చూశాడని,  ఇప్పుడు ఆ లీగ్‌ జరిగే అవకాశాలు లేకపోవడంతో జాతీయ జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. కాకపోతే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)..ధోనికి చివరగా ఒక అవకాశం ఇచ్చి చూస్తుందన్నాడు. అది కూడా టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చివరి అవకాశం లభిస్తుందన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top