లెగ్‌ స్పిన్నర్‌గా ధోని!

MS Dhoni Turns Leg-Spinner Ahead Of 5th ODI - Sakshi

నెట్స్‌లో స్పిన్‌ ప్రాక్టీస్‌ చేసిన ధోని

ఐదో వన్డేలో బౌలింగ్‌ చేయనున్నాడా?

సాక్షి, స్పోర్ట్స్‌ : సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని వికెట్‌ కీపర్‌ కమ్‌, బ్యాట్స్‌మన్‌ కదా! లెగ్‌ స్పిన్నర్‌ అంటున్నారేంటి అనుకుంటున్నారా?  ఇప్పటి వరకు ధనాధన్‌ హెలికాప్టర్‌ షాట్‌లతో, కళ్లు చెదిరే కీపింగ్‌తో మైమరిపించి విజయాలంధించిన ధోని ఇప్పుడు బౌలర్‌గా మారనున్నాడా ? అవును ధోని దక్షిణాఫ్రికాతో ఐదో వన్డేకు ముందు నెట్స్‌లో లెగ్‌ స్పిన్‌ ప్రాక్టీస్‌ చేయడం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌తో ధోని లెగ్‌ స్పిన్‌పై కసరత్తు చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ ‘అక్షర్‌తో ధోని లెగ్‌ స్పిన్‌ ప్రాక్టీస్‌’ అంటూ ట్వీట్‌ చేసింది.

ఐదో వన్డే జరిగే పోర్ట్‌ ఎలిజబెత్‌లోని సెయింట్‌ జార్జ్‌ పిచ్‌ దక్షిణాఫ్రికాలోనే నెమ్మదైన పిచ్‌ కావడంతో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ధోని స్పిన్‌ను ప్రాక్టీస్‌ చేసినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు భారత్‌కు అనుకూలిస్తే ధోని బౌలింగ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో ఇప్పటికే బౌలింగ్‌ చేసి ధోని ఓ వికెట్‌ తీసిన విషయం తెలిసిందే. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సరదాగా బౌలింగ్‌ చేసి 14 పరుగులిచ్చి ఓ (ట్రావిస్‌ డౌలిన్‌) వికెట్‌ తీశాడు. అయితే అప్పడు పేస్‌ బౌలింగ్‌ వేసిన ధోని ఇప్పుడు స్పిన్‌ ప్రాక్టీస్‌ చేయడం విశేషం.

ఇక టీమిండియా ఈ సిరీస్‌లో 3-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌ నెగ్గి రికార్డు నెలకొల్పాలని కోహ్లి సేన భావిస్తోంది. 

ధోని బౌలింగ్ ప్రాక్టీస్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top