ఆరు భాషల్లో అదరగొడుతున్న జీవా | MS Dhoni Talking To Daughter Ziva In Six Languages | Sakshi
Sakshi News home page

ఆరు భాషల్లో అదరగొడుతున్న జీవా

Mar 25 2019 1:02 PM | Updated on Mar 25 2019 1:19 PM

MS Dhoni Talking To Daughter Ziva In Six Languages - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి(సీఎస్‌కే) ఎంఎస్‌ ధోని సోషల్‌ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఒకవేళ అలా కనిపించినా.. ధోనితో పాటు అతని కూతురు జీవా కూడా ఉండాల్సిందే. తన ముద్దుల కూతురుతో కలిసి ధోనీ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరి అ‍ల్లరికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు ధోని. తాజాగా ఈ తండ్రికూతుళ్లిద్దరికి సంబంధించిన మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు ధోని. ఈ వీడియోలో జీవా.. ధోని అడిగిన ఓ ప్రశ్నకు ఆరు భాషల్లో సమాధానం చెప్పి అదరగొట్టింది. ధోనీ తన కూతుర్ని ‘హౌ ఆర్‌ యూ’(ఎలా ఉన్నావు) అని తమిళ్‌, బెంగాలీ, గుజరాత్‌, పంజాబీ, భోజ్‌పూరి, ఉర్దూ భాషల్లో అడుగుతాడు. జీవా కూడా ధోని ఏ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం చెప్పి ఔరా అనిపించుకుంది.

ఇకపోతే ఐపీఎల్‌ 12వ సీజన్‌లో భాగంగా ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement