పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ | Mohammad Hafeez suspended for illegal bowling action | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ

Dec 7 2014 1:21 PM | Updated on Mar 23 2019 8:23 PM

పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ - Sakshi

పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురుదెబ్బ

వన్డే ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురు దెబ్బ తగిలింది.

దుబాయ్: వన్డే ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్ క్రికెట్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్  ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ వేటు వేసింది. హఫీజ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బయో మెట్రిక్ పరీక్షలో తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. హఫీజ్ బౌలింగ్ శైలిని గత నెలలో పరీక్షించారు.

త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం శనివారం పాకిస్థాన్ ప్రాబబుల్స్కు హఫీజ్ను ఎంపిక చేశారు. మరుసటి రోజే అతనిపై వేటు పడటం పాక్ క్రికెట్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇదే కారణంతో మరో పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ను ఐసీసీ సస్పెండ్ చేసింది. ప్రపంచ కప్ ముందు ఇద్దరు కీలక బౌలర్లపై వేటుపడటం పాక్ క్రికెట్ను కలవరపెడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement