విజయ రహస్యాన్ని ఇమ్రాన్ ను అడిగి తెలుసుకుంటా! | Misbah-ul-Haq hopes to seek Imran Khan's help for 2015 World Cup | Sakshi
Sakshi News home page

విజయ రహస్యాన్ని ఇమ్రాన్ ను అడిగి తెలుసుకుంటా!

Sep 17 2014 9:14 PM | Updated on Sep 2 2017 1:32 PM

విజయ రహస్యాన్ని ఇమ్రాన్ ను అడిగి తెలుసుకుంటా!

విజయ రహస్యాన్ని ఇమ్రాన్ ను అడిగి తెలుసుకుంటా!

ప్రపంచ కప్ గెలుచుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్పావుల్ హక్ ప్రయత్నాల్ని ప్రారంభించారు.

ప్రపంచ కప్ గెలుచుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ మిస్పావుల్ హక్ ప్రయత్నాల్ని ప్రారంభించారు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ వ్యవహరిస్తున్న మిస్బావుల్ హక్ 2015 ప్రపంచకప్ ను గెలుచుకునేందుకు మాజీ కెప్టెన్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ సలహాలను తీసుకోవాలని అనుకుంటున్నారు. 1992 లో అండర్ డాగ్స్ ఉన్న పాక్ క్రికెట్ జట్టుకు తన కరిష్మాతో ప్రపంచకప్ ను ఇమ్రాన్ ఖాన్ సాధించిన సంగతి తెలిసిందే. 
 
పాక్ క్రికెట్ జట్టులో స్పూర్తిని నింపడానికి ఇమ్రాన్ సలహాలు అమూల్యమైనవని మిస్బావుల్ హక్ భావిస్తున్నారు. క్రికెట్ పై ఇమ్రాన్ ఖాన్ ఉన్న పట్టు యువ క్రికెటర్లకు స్పూర్తిని, తోడ్పాటును అందిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రపంచకప్ కు వెల్లడానికి ముందు ఇమ్రాన్ సలహాలు, మార్గదర్శకాలను తీసుకుంటామన్నారు. 1992 సంవత్సరంలో దక్కిన విజయాన్ని మళ్లీ సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ను అడుగుతానన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement