34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత | Messi Scores 34th Hat Trick Equals Ronaldo's Record | Sakshi
Sakshi News home page

34వ హ్యాట్రిక్‌తో అరుదైన ఘనత

Nov 10 2019 4:03 PM | Updated on Nov 10 2019 4:34 PM

Messi Scores 34th Hat Trick Equals Ronaldo's Record - Sakshi

మాడ్రిడ్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ అరుదైన మైలురాయిని సాధించాడు. ప్రతిష్టాత్మక స్పెయినీష్‌ లీగ్‌ లాలీగా టోర్నమెంట్‌లో భాగంగా సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టాడు. ఫలితంగా బార్సిలోనా 4-1 తేడాతో సెల్టా విగోపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడంతో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో సరసన నిలిచాడు.

ఓవరాల్‌ లా లీగా టోర్నమెంట్‌లో అత్యధికంగా హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించిన జాబితాలో ఇప్పటివరకూ రొనాల్డ్‌ ఉండగా, ఇప్పుడు మెస్సీ కూడా చేరిపోయాడు. లాలీగా టోర్నీలో మెస్సీకి ఇది 34వ హ్యాట్రిక్‌. తొలి అర్థభాగంలో ఫ్రీకిక్‌ ద్వారా గోల్‌ సాధించిన మెస్సీ.. రెండో అర్థ భాగంలో మరో రెండు గోల్స్‌ సాధించి హ్యాట్రిక్‌ గోల్స్‌ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గేమ్‌ చివర్లో సెర్గియో బస్య్కూట్‌ గోల్‌ సాధించడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. కాగా, చివరి మూడు గేమ్‌ల్లో బార్సిలోనాకు ఇది తొలి విజయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement