షుమాకర్ మెడికల్ డాక్యుమెంట్లు చోరీ | Medical Notes Allegedly On Schumacher Touted For Sale | Sakshi
Sakshi News home page

షుమాకర్ మెడికల్ డాక్యుమెంట్లు చోరీ

Jun 25 2014 1:21 AM | Updated on Sep 2 2017 9:20 AM

షుమాకర్ మెడికల్ డాక్యుమెంట్లు చోరీ

షుమాకర్ మెడికల్ డాక్యుమెంట్లు చోరీ

ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ చికిత్సకు సంబంధించిన వైద్య పత్రాలు చోరీకి గురైనట్లు అతని మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ స్టార్ రేసర్ కోమాకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయని, వీటిని అమ్ముతామని ఎత్తుకెళ్లిన దొంగలు చెబుతున్నారు.

జెనీవా: ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ చికిత్సకు సంబంధించిన వైద్య పత్రాలు చోరీకి గురైనట్లు అతని మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ స్టార్ రేసర్ కోమాకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయని, వీటిని అమ్ముతామని ఎత్తుకెళ్లిన దొంగలు చెబుతున్నారు. ‘గత కొన్ని రోజులుగా దొంగిలించబడిన పత్రాలు, డాటాను అమ్మకానికి పెట్టారు. ఇవి షుమాకర్‌కు సంబంధించిన పత్రాలని వాళ్లు చెబుతున్నారు.
 
 అయితే ఇవి నిజమైనవో కావో మేం తెలుసుకోలేకపోతున్నాం. కానీ వైద్య పత్రాలైతే చోరీకి గురయ్యాయి’ అని షుమీ అధికార ప్రతినిధి సబీనా కెమ్ తెలిపింది. పత్రాలను దొంగిలించిన నేరస్తుడు కొంత మంది ఫ్రెంచ్, స్విస్, జర్మన్ జర్నలిస్ట్‌లతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నాడని, 67 వేల డాలర్లకు వీటిని అమ్మకానికిపెట్టాడని వార్తలు వచ్చాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement