మయాంక్‌ అగర్వాల్‌ శతకం

Mayank Agarwal century steers India B into final - Sakshi

 భారత్‌ ‘బి’ విజయం

బెంగళూరు: ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (114 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం బాదడంతో నాలుగు జట్ల వన్డే టోర్నీలో భారత్‌ ‘బి’ జయకేతనం ఎగురవేసింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత భారత్‌ ‘ఎ’ 49 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. అంబటి రాయుడు (75 బంతుల్లో 48; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. సంజూ శాంసన్‌ (50 బంతుల్లో 32; 2 సిక్స్‌లు), కృష్ణప్ప గౌతమ్‌ (32 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు రవి సమర్థ్‌ (0), సూర్యకుమార్‌ యాదవ్‌ (11) సహా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (20)లను త్వరగా అవుట్‌ చేసి... పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ (4/50) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. శ్రేయస్‌ గోపాల్‌ (2/38) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో మయాంక్‌కు తోడుగా ఇషాన్‌ కిషన్‌ (25), శుబ్‌మన్‌ గిల్‌ (42), కెప్టెన్‌ మనీశ్‌ పాండే (21 నాటౌట్‌) తలోచేయి వేయడంతో‘బి’ జట్టు 41.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’ పై 32 పరుగులతో ఆస్ట్రేలియా ‘ఎ’ గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top