నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ మూమెంట్‌ అదే: రైనా | Matthew Hayden's Knock Is Raina's favourite IPL Moment | Sakshi
Sakshi News home page

నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ మూమెంట్‌ అదే: రైనా

Apr 13 2020 5:04 PM | Updated on Apr 13 2020 5:04 PM

Matthew Hayden's Knock Is Raina's favourite IPL Moment - Sakshi

సురేశ్‌ రైనా(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరగడం అనేది డైలమాలో పడింది. ప్రస్తుతం క్రికెటర్లంతా ఇంట్లోని ఉంటూ ఏదొక ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకంగా లాక్‌డౌన్‌ రోజుల్ని ఆస్వాదిస్తూ గత జ్ఞాపకాల్ని షేర్‌ చేసుకుంటున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఆడిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ మై ఐపీఎల్‌ మూమెంట్‌ హాష్‌ ట్యాగ్‌తో సురేశ్‌ రైనాకు ట్వీట్‌ చేశాడు.  దీనిపై స్పందించిన రైనా.. ఐపీఎల్‌లో నచ్చిన ఇన్నింగ్స్‌ గురించి చెబుతూ పదేళ్ల నాటి జ్ఞాపకాన్ని నెమరవేసుకున్నాడు.  2010లో అప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరుతో ఉన్న జట్టుపై హేడెన్‌ చేసిన 93 పరుగుల్నితన ఫేవరెట్‌ ఐపీఎల్‌ ఫేవరెట్‌ మూమెంట్‌గా రైనా చెప్పాడు. (ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న)

ఆ మ్యాచ్‌లో  మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించిన హేడెన్‌ 43 బంతుల్లో 7 సిక్సర్లు, 9 ఫోర్లతో చెలరేగిన విషయాన్ని ప్రస్తావించాడు. ఇది తన ఓవరాల్‌ ఐపీఎల్‌ ఫేవరెట్‌ మూమెంట్‌ అన్నాడు. ఆ మ్యాచ్‌కు సారథిగా ఉన్న రైనా 49 పరుగులు చేశాడు.  ‘ ఆ మ్యాచ్‌లో మనం మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. నేను 49 పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్‌గా కూడా ఉన్నా. మనం గెలుస్తామనే నమ్మకాన్ని  కల్పించావు హేడెన్‌. అది నీ బ్యాట్‌ నుంచి వచ్చిన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌.  ఆరోజు మీ సంతకం చేసిన ఇచ్చిన బ్యాట్‌ ఇంకా నాతోనే ఉంది.  ఆ విషయం గుర్తుండే ఉంటుందని అనుకుంటున్నా’ అని రైనా పేర్కొన్నాడు.(కోచ్‌ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా?)

Advertisement
 
Advertisement
Advertisement