పతకం తెస్తానో లేదో..: మేరీకోమ్‌ | Mary Kom Aiming for World Boxing Championship Medal to Silence Critics | Sakshi
Sakshi News home page

పతకం తెస్తానో లేదో..: మేరీకోమ్‌

Sep 29 2019 3:57 AM | Updated on Sep 29 2019 3:57 AM

Mary Kom Aiming for World Boxing Championship Medal to Silence Critics - Sakshi

న్యూఢిల్లీ: రష్యాలోని ఉలాన్‌ ఉదెలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తాననే హామీ ఇవ్వలేనని భారత మహిళా బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ పేర్కొంది. ‘నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా. ప్రతి ఈవెంట్‌ లో  అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. పతకం సాధిస్తానని మాత్రం చెప్పలేను’ అని వ్యాఖ్యానించింది. స్థాయికి తగ్గట్లు రాణిస్తే స్వర్ణం సాధించడం సమస్య కాబోదని పేర్కొంది. మేరీ ఇప్పటివరకు 8 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లలో 48 కేజీల విభాగంలో 7 పతకాలు సాధించగా... రాబోయే చాంపియన్‌ షిప్‌లో తొలిసారి 51 కేజీల విభాగంలో పోటీ పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement