యూఎస్‌ ఓపెన్‌ 2017.. షరపోవా అవుట్‌ | Maria Sharapova knocked out of US Open 2017 | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌ 2017.. షరపోవా అవుట్‌

Sep 4 2017 9:00 AM | Updated on Aug 24 2018 5:21 PM

యూఎస్‌ ఓపెన్‌ 2017.. షరపోవా అవుట్‌ - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ 2017.. షరపోవా అవుట్‌

రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌, డోపింగ్‌ ఆరోపణల అనంతరం రీఎంట్రీ ఇచ్చిన మరియా షరపోవా...

సాక్షి, స్పోర్ట్స్(న్యూయార్క్‌)‌:  యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో మరియా షరపోవా పోరు ముగిసింది. నాలుగో రౌండ్‌లో ఓటమితో టోర్నీ నుంచి ఈ రష్యన్‌ భామ నిష్క్రమించింది. 
 
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లాత్వియన్‌కు చెందిన అనస్తాసిజా సెవస్తోవాతో తలపడగా 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓటమిపాలైంది. తద్వారా మాజీ ఛాంపియన్‌ ఓడించిన అనస్తాసిజా క్వార‍్టర్‌ ఫైనల్‌ కు చేరుకుంది. అమెరికాకు చెందిన స్లోయెన్‌ స్టీఫెన్స్ తో  క్వార‍్టర్‌లో అనస్తాసిజా తలపడనుంది.
 
ముప్పై ఏళ్ల షరపోవా డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కుని ఏప్రిల్‌లో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. వైల్డ్ కార్డు ద్వారా ఆమె యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఆడిన విషయం తెలిసిందే. ఆరంభంలో అదరగొట్టిన షరపోవా చివరకు ఓటమితో అభిమానులను నిరాశపరిచింది.

Advertisement
 
Advertisement
Advertisement