సైనా, సింధు మిగిలారు! | Malaysia Open tournament :- After losing the first round, Srikanth | Sakshi
Sakshi News home page

సైనా, సింధు మిగిలారు!

Apr 7 2016 12:40 AM | Updated on Sep 3 2017 9:20 PM

సైనా, సింధు మిగిలారు!

సైనా, సింధు మిగిలారు!

స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాదిరిగానే...

తొలి రౌండ్‌లోనే ఓడిన శ్రీకాంత్
  ప్రణయ్, జయరామ్ కూడా
మలేసియా ఓపెన్ టోర్నీ

 
షా ఆలమ్ (మలేసియా): స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో మాదిరిగానే... మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లోనూ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లందరూ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, అజయ్ జయరామ్ తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసి నిరాశపరిచారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు తొలి రౌండ్‌లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

పురుషుల డబుల్స్‌లో బరిలో ఉన్న భారత జోడీ సుమీత్ రెడ్డి-మనూ అత్రి కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. దాంతో ఈ టోర్నీలో భారత్ తరఫున సైనా, సింధు మాత్రమే మిగిలారు.మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా 21-16, 21-7తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... సింధు 21-16, 21-17తో హీ బింగ్‌జియావో (చైనా)ను ఓడించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు; యోన్ జూ బే (దక్షిణ కొరియా)తో సైనా తలపడతారు.


బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-23, 21-9, 10-21తో బూన్‌సాక్ పొన్సానా (థాయ్‌లాండ్) చేతిలో... ప్రణయ్ 19-21, 20-22తో కెంటో మొమొటా (జపాన్) చేతిలో... అజయ్ జయరామ్ 17-21, 14-21తో హు యున్ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 11-21, 10-21తో ఇవనోవ్-సొజోనోవ్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement