రన్‌..రన్‌.. రనౌట్‌! | Mahmudullah run out adding to the drama | Sakshi
Sakshi News home page

రన్‌..రన్‌.. రనౌట్‌!

Mar 18 2018 8:39 PM | Updated on Mar 18 2018 8:53 PM

Mahmudullah run out adding to the drama - Sakshi

కొలంబో: బంగ్లాదేశ్‌ ఆటగాడు మొహ్మదుల్లా-టీమిండియా ఆటగాడు విజయ్‌ శంకర్‌లు పిచ్‌పై పోటీ పడి పరుగెత్తారు. అందులో మొహ్మదుల్లాది రనౌట్‌ను తప్పించుకునే ప్రయత్నమైతే, విజయ్‌ శంకర్‌ది మాత్రం రనౌట్‌ చేసే ఆత్రం. ఆ ఇద్దరూ రన్‌..రన్‌ అంటూ పరుగెత్తగా చివరకు విజయ్‌ శంకర్‌ పైచేయి సాధించాడు. అంటే మొహ్మదుల్లా రనౌట్‌ను చేశాడు.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా విజయ్‌ శంకర్‌ వేసిన 15 ఓవర్‌ రెండో బంతిని ఫ్లిక్‌ చేసి రన్‌ కోసం యత్నించాడు. అవతలి ఎండ్‌లో షబ్బీర్‌ రెహ్మాన్‌ కూడా పరుగు కోసం రావాలంటూ గట్టిగా అరిచాడు. ఏకబిగిన స్టైకింగ్‌ ఎండ్‌లోకి దూసుకుపోయాడు. కాగా, పరుగు తీద్దామా.. వద్దా అని ఆలోచించిన మొహ్మదుల్లా తొలుత ఆగుతూ పరిగెట్టాడు. అయితే షబ్బీర్‌ రెహ్మాన్‌ అప్పటికే సగం పిచ్‌ను దాటి వెళ్లిపోవడంతో మొహ్మదుల్లా దౌడ్‌ తీశాడు. అదే సమయంలో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ బంతిని అందుకుని విజయ్‌ శంకర్‌కు అందించాడు. అప్పుడు మొహ్మదుల్లా, విజయ్‌ శంకర్‌ల మధ్య దూరం అంతరం కూడా పెద్దగా లేదు. బంతిని అందుకున్న శంకర్‌.. కొద్దిపాటి తడబాటుకు గురయ్యాడు. చివరికి తనను తాను నియంత్రించుకున్న శంకర్‌ బంతిని వికెట్లపైకి విసిరి బెయిల్స్‌ను పడగొట్టాడు. దాంతో మొహ్మదుల్లా నిరాశగా తిట్టుకుంటూ పెవిలియన్‌కు చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement