ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం | Mahendra Singh Dhoni to miss first Test against Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం

Nov 10 2014 3:02 PM | Updated on Sep 2 2017 4:12 PM

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టుకు ధోని దూరం

శ్రీలంకతో జరగనున్న చివరి రెండు వన్డేలకు, ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టుకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కానున్నాడు.

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న చివరి రెండు వన్డేలకు, ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టుకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరం కానున్నాడు. ముంజేతి గాయం కారణంగా అతడు తర్వాతి మ్యాచ్ లకు ఆడడం అనుమానంగా మారింది. ధోని పూర్తిగా కోలుకోలేదని ఫిజియో కోచ్ నిర్ధారించడంతో అతడు ఆడకపోవచ్చని తెలుస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డేల సిరీస్ లో మొదటి మూడు వన్డేలకు ధోని విశ్రాంతి కోరడంతో అతడి స్థానంలో విరాట్ కోహ్లి జట్టుకు నాయకత్వం వహించాడు.

లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ, కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్ టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముందని సమాచారం. డిసెంబర్ 4 నుంచి భారత్, ఆస్టేలియా టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది

Advertisement
 
Advertisement
Advertisement