మెస్సీ మ్యాజిక్: క్వార్టర్స్కు అర్జెంటీనా | Magical Messi grabs hat-trick as Argentina romp into quarters | Sakshi
Sakshi News home page

మెస్సీ మ్యాజిక్: క్వార్టర్స్కు అర్జెంటీనా

Jun 11 2016 3:48 PM | Updated on Sep 4 2017 2:15 AM

మెస్సీ మ్యాజిక్: క్వార్టర్స్కు అర్జెంటీనా

మెస్సీ మ్యాజిక్: క్వార్టర్స్కు అర్జెంటీనా

గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ పునరాగమన మ్యాచ్లో అదరగొట్టాడు.

చికాగో: గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ  పునరాగమన మ్యాచ్లో అదరగొట్టాడు.  కోపా అమెరికా కప్లో భాగంగా గ్రూప్-డిలో పనామాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ మ్యాజిక్ చేశాడు. 19 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్తో మెరిసి జట్టును క్వార్టర్స్ చేర్చాడు. ఆట 61వ నిమిషంలో అగస్టో  ఫెర్నాండేజ్ స్థానంలో ఫీల్డ్లోకి వచ్చిన మెస్సీ  మెరుపు వేగంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు.

 

ఆట 68వ నిమిషంలో తొలి వ్యక్తిగత గోల్ చేసిన మెస్సీ, ఆపై 78 నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా మరో గోల్ చేసి జట్టును మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.  ఆపై 87వ నిమిషంలో మెస్సీ  గోల్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.  ఇక ఆట చివర్లో  ఆగ్యురో మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-0తేడాతో సంపూర్ణ విజయం సాధించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement