
ఉరుగ్వే కోచ్ నిరసన...
తమ స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్‌ను ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబరెజ్ ‘ఫిఫా’ వ్యూహాత్మక కమిటీ నుంచి తప్పుకున్నారు.
రియో డి జనీరో: తమ స్టార్ ఆటగాడు లూయిస్ స్వారెజ్‌ను ప్రపంచకప్ నుంచి బహిష్కరించినందుకు నిరసనగా ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబరెజ్ ‘ఫిఫా’ వ్యూహాత్మక కమిటీ నుంచి తప్పుకున్నారు.
ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు చిలిని భుజం కొరికినందుకు స్వారెజ్‌పై నాలుగు నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ స్టార్ ఆటగాడిపై నిషేధానికి ఇంగ్లిష్ మీడియా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఉరుగ్వే ఒంటరిదై పోయిందని, మొత్తానికి స్వారెజ్ బలిపశువయ్యాడని ఆవేదన చెందారు. అతడిపై చర్య ఉంటుందని అనుకున్నా... ఫిఫా ఇంత కఠినంగా స్పందిస్తుందని భావించలేదని తబరెజ్ పేర్కొన్నారు.