'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర' | Luck played a big part at the start of my career, Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర'

May 30 2015 6:20 PM | Updated on Sep 3 2017 2:57 AM

'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర'

'నా క్రికెట్ జీవితంలో అదృష్టానిదే ప్రధాన పాత్ర'

తన క్రికెట్ జీవితంలో అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు.

ముంబై: తన క్రికెట్ జీవితంలో  అదృష్టం ప్రధాన పాత్ర పోషించిందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తాజాగా స్పష్టం చేశాడు. తాను క్రికెట్ కెరీర్ ను ఆరంభించిన తొలినాళ్లలో అదృష్టమే కాపాడిందని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టే జీవితం ఆధారంగా రాస్తున్న 'యాజ్ లక్ వుడ్ హేవ్ ఇట్' పుస్తకాన్ని ప్రారంభించిన గవాస్కర్..  తన గత స్మృతులను నెమరవేసుకున్నాడు. తాను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది నిజంగా అదృష్టమేనన్నాడు. 1971లో భారత్ చేపట్టిన వెస్టిండీస్ పర్యటనను ఈ సందర్భంగా గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు. ఆ పర్యటన మాత్రం తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందన్నాడు. అయినా ఇక్కడ ఉన్నానంటే మాత్రం అది అదృష్టంతోనేనని పేర్కొన్నాడు.

 

ఆ సిరీస్ లోని ఒక టెస్ట్ మ్యాచ్ లో తాను కొట్టిన షాట్ కు పరుగు తీస్తుండగా.. వెస్టిండీస్ ఆటగాడు గ్యారీ సోబర్స్ ఫీల్డింగ్ చేస్తూ విసిరిన బంతి తన ఛాతిపై బలంగా తగిలి గ్రౌండ్ లో పడిపోయానన్నాడు. అనంతరం తీవ్రమైన  నొప్పితోనే హాఫ్ సెంచరీ చేశానన్నాడు. 1971 నుంచి 1987 వరకూ 16 సంవత్సరాల పాటు క్రికెట్ జీవితాన్ని అత్యుద్భుతంగా ఆస్వాదించిన గవాస్కర్.. 125టెస్టుల్లో 10,122 పరుగులు చేసి అరుదైన ఘనతను సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement