డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి | Lodha panel tightens the screws, issues BCCI 2nd set of deadlines | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి

Sep 2 2016 12:56 AM | Updated on Aug 14 2018 5:56 PM

డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి - Sakshi

డిసెంబర్ 30లోగా అన్ని ఎన్నికలు జరపండి

బీసీసీఐకి జస్టిస్ లోధా కమిటీ మరోసారి డెడ్‌లైన్ విధించింది. అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికలతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 15లోగా...

బీసీసీఐకి లోధా ప్యానెల్ ఆదేశం  
న్యూఢిల్లీ: బీసీసీఐకి జస్టిస్ లోధా కమిటీ మరోసారి డెడ్‌లైన్ విధించింది. అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికలతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిసెంబర్ 15లోగా జరపాలని ఆదేశించింది. ఆదివారం జరిగిన లోధా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈనెల 21న బోర్డు ఏజీఎంను ఏర్పాటు చేయాలని భావించింది. అరుుతే ఈ సమావేశంలో 2015-16కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలనే చర్చించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగవద్దని సూచించింది. మరోవైపు నూతనంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త నిబంధనలు, కొత్త కమిటీలను కూడా డిసెంబర్ 30లోగా ఏర్పాటు చేయాలని గడువు విధించింది. దీంతో పాటు నవంబర్ 15లోపు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement