‘ఏడవకురా చిన్నోడా.. మనం ఫైనల్‌ గెలుస్తాం’ | Little Indian Fan Crying After Tie Against Afghanistan | Sakshi
Sakshi News home page

Sep 26 2018 4:41 PM | Updated on Mar 28 2019 6:10 PM

Little Indian Fan Crying After Tie Against Afghanistan - Sakshi

మ్యాచ్‌ టై అయిందని ఏడుస్తున్న చిన్నోడు

ఈ చిన్నోడు మాత్రం కళ్లలోంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నాడు..

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం భారత్‌-అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో ఓ భావోద్వేగపు సన్నివేశం చోటుచేసుకుంది. అసాంతం అత్యంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్‌పై అభిమానులకు ఉన్న ప్రేమ ఏంటో ప్రతిబింబించింది. ఇటీవలె హాంకాంగ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఓ పిల్లోడు తన అభిమాన క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ఔటయ్యాడని.. ఏడుస్తూ మారం చేయడం మనమంతా చూశాం. అచ్చు అలాంటి సీన్‌ నిన్నటి మ్యాచ్‌లోనూ రిపీట్‌ అయింది. దాదాపు భారత్‌ గెలుపు కాయమనుకున్న తరుణంలో జడేజా ఔటవ్వడం.. మ్యాచ్‌ టై కావడం ఓ సిక్కు పిల్లాడు తట్టుకోలేకపోయాడు.

ఓవైపు మైదానంలో అఫ్గాన్‌ ఆటగాళ్లు గెలిచామనే సంతోషంతో సంబురాలు చేసుకుంటుంటే.. మరోవైపు గ్యాలరీలో ఈ చిన్నోడు మాత్రం కళ్లలోంచి ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నాడు. పక్కనే ఉన్న తన తండ్రి ఎంత ఓదార్చిన ఆ చిన్నోడు మాత్రం తన బాధను ఆపుకోలేకపోయాడు. టీవీల ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు ఇది చూసి అయ్యో అని బాధపడ్డారు. ప్రస్తుతం ఈ సీన్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిన్నోడు ఓదారుస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆ అబ్బాయిని చూస్తే బాధేస్తుంది. కానీ ఈ రోజు ఇది ఓ అందమైన క్షణం’ అని ఒకరు..ఈ మ్యాచ్‌ను ఎప్పటికి మరిచిపోలేరని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. ఇక టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ‘ఏడవకురా చిన్నోడా.. మనం ఫైనల్‌ గెలుస్తాం’ అని ట్వీట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement