హామిల్టన్‌దే విజయం | Lewis Hamilton Won In The Australian Formula One Grand Prix | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌దే విజయం

Jul 13 2020 12:52 AM | Updated on Jul 13 2020 12:52 AM

Lewis Hamilton Won In The Australian Formula One Grand Prix - Sakshi

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అద్భుతంగా రాణించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ప్రధాన రేసులోనూ అదే జోరు కొనసాగించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసులో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన హామిల్టన్‌ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 22 నిమిషాల 50.683 సెకన్లలో పూర్తి చేసి టైటిల్‌ గెలిచాడు.

హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 85వ టైటిల్‌ కావడం విశేషం. జర్మనీ దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ (91) పేరిట ఉన్న అత్యధిక ఎఫ్‌1 టైటిల్స్‌ రికార్డు సమం చేసేందుకు హామిల్టన్‌ మరో ఆరు విజయాల దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానాన్ని పొందగా... వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్లు వెటెల్, లెక్‌లెర్క్‌ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్క్రమించారు. సీజన్‌లోని మూడో రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. 

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్‌–10)
1. లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వాల్తెరి బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 4. ఆల్బోన్‌ (రెడ్‌బుల్‌), 5. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 6. సెర్గియో పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 7. స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 8. రికియార్డో (రెనౌ), 9. కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 10. డానియల్‌ క్వియాట్‌ (అల్ఫాటౌరి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement