'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు' | Lalit Modi alleges Suresh Raina, Dwayne Bravo, Ravindra Jadeja involved in IPL betting | Sakshi
Sakshi News home page

'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'

Jun 27 2015 8:05 PM | Updated on Sep 3 2017 4:28 AM

'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'

'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రావోలు బెట్టింగ్కు పాల్పడ్డారని లలిత్ మోదీ ఆరోపించారు.

లండన్: రోజుకో సంచనం రేపుతానన్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ అన్నట్టుగానే చేశారు. ఇప్పటివరకు రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా క్రికెటర్లకు కూడా బురద అంటించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రావోలు బెట్టింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ మేరకు శనివారం రాత్రి ట్విట్టర్ లో పలు అంశాలు వెల్లడించారు. బాబా దీవాన్ అనే బుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడమేకాకుండా పలు చోట్ల ఫ్లాట్లు కూడా కొనిచ్చాడని చెప్పారు. ఇదే విషయమై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్కు 2013 తాను రాసిన లేఖను మోదీ బహిర్గతం చేశారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు బెట్టింగ్, ఫిక్సింగ్ కు పాల్పడి అనర్హులుకాగా, మోదీ తాజా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement