హంపి గెలుపు, హారిక గేమ్ ‘డ్రా’ | Koneru Humpy, D Harika take lead in World championship opener | Sakshi
Sakshi News home page

హంపి గెలుపు, హారిక గేమ్ ‘డ్రా’

Mar 21 2015 1:07 AM | Updated on Sep 2 2017 11:09 PM

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన విజయపరంపర కొనసాగిస్తోంది.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 66 ఎత్తుల్లో లీ తింగ్‌జి (చైనా)పై గెలిచింది. శనివారం జరిగే రెండో గేమ్‌ను హంపి కనీసం ‘డ్రా’ చేసుకున్నా మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన రెండో రౌండ్ తొలి గేమ్‌ను ఇరీనా క్రుష్ (అమెరికా)తో 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement