నరైన్పై కేకేఆర్ ఆశలు! | Kolkata Knight Riders back embattled spinner Narine | Sakshi
Sakshi News home page

నరైన్పై కేకేఆర్ ఆశలు!

Feb 16 2016 3:56 PM | Updated on Sep 3 2017 5:46 PM

నరైన్పై కేకేఆర్ ఆశలు!

నరైన్పై కేకేఆర్ ఆశలు!

గతేడాది నవంబర్ లో సందేహాస్పద బౌలింగ్ తో సస్పెండ్ గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్పై అతని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ ఆశలు పెట్టుకుంది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: గతేడాది నవంబర్ లో సందేహాస్పద బౌలింగ్ తో సస్పెండ్ గురైన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్పై అతని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రాంఛైజీ  కోల్కతా నైట్ రైడర్స్ ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యేసరికి నరైన్ అందుబాటులో ఉంటాడని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 'అతనొక చాంపియన్. అందులో ఎటువంటి అనుమానం లేదు. అతను మా జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉంది.  మా జట్టులో నరైన్ కీలక ఆటగాడు. నరైన్ యాక్షన్ అనేది అతనికి సహజసిద్ధంగా వచ్చిన లక్షణం. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే అతనిపై వేటు పడింది. ఐసీసీ నిర్వహించే టెస్టుల్లో నరైన్ సఫలం అవుతాడనే నమ్మకం ఉంది' అని వెంకీ తెలిపారు.

 

గత నాలుగు సీజన్ల నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడుతున్న నరైన్  74 వికెట్లు తీసి ఆ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.  2012, 14 సీజన్లలో కోల్ కతా ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కూడా నరైన్ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా  భారత్లో జరుగనున్న వరల్డ్ టీ 20లో పాల్గొనే వెస్టిండీస్ జట్టు నుంచి నరైన్ తో పాటు, కీరన్ పొలార్డ్ల్ లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరల్డ్ టీ 20 కోసం ఎంపిక చేసిన విండీస్ జట్టులో నరైన్ కు చోటు దక్కినా అతను ఈ టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.  తన బౌలింగ్ శైలిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వరల్డ్ టీ20లో పాల్గొనడం లేదని నరైన స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement