కోహ్లి ‘టాప్‌’ పదిలం

Kohli retains top spot in ICC Test rankings - Sakshi

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టు అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లి టాప్‌ ప్లేస్‌ను పదిలంగా ఉంచుకున్నాడు. ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టులో కోహ్లి(46, 58) ఆకట్టుకున్నాడు. ఫలితంగా కెరీర్‌ అత్యత్తుమ రేటింగ్‌ పాయింట్లతో కోహ్లి నంబర్‌ వన్‌ ర్యాంకును కాపాడుకున్నాడు. మూడో టెస్టు తర్వాత కోహ్లి టాప్‌ ప్లేస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు తర్వాత కోహ్లి 937 రేటింగ్‌ పాయింట్లను సాధించాడు. ఇది కోహ్లి కెరీర్‌లోనే అత్యధిక టెస్టు రేటింగ్‌ పాయింట్లగా నమోదైంది.

ప్రస్తుతం​ అవే రేటింగ్‌ పాయింట్లతో కోహ్లి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో చతేశ్వర పుజారా ఆరోస్థానంలో ఉన్నాడు. దాంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తర్వాత మెరుగైన స్థానాన్ని ఆక్రమించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత పేసర్‌ మొహ్మద్‌ షమీ మూడు స్థానాలు ఎగబాకి టాప్‌-20కి వచ్చాడు. ప్రస్తుతం షమీ 19 స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top