సమీక్షకు వెళ్లకపోయుంటే... | KL Rahul regrets wasting review in tied clash against Afghanistan | Sakshi
Sakshi News home page

సమీక్షకు వెళ్లకపోయుంటే...

Sep 27 2018 1:47 AM | Updated on Mar 28 2019 6:10 PM

KL Rahul regrets wasting review in tied clash against Afghanistan - Sakshi

దుబాయ్‌: సూపర్‌–4లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తాను డీఆర్‌ఎస్‌ కోరకుండా ఉండాల్సిందని ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌  అం టున్నాడు. మ్యాచ్‌లో అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా  రాహుల్‌ సమీక్ష కోరి దాన్ని వృథా చేశాడు. ఈ ప్రభావం కీలక సమయంలో కనిపించింది.

రివ్యూలు లేకపోవడంతో ధోని, దినేశ్‌ కార్తీక్‌లు అంపైర్‌ సందేహాస్పద నిర్ణయానికి కట్టుబడి వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రాహుల్‌పై విమర్శలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ... బంతి వికెట్‌కు దూరంగా వెళ్తుందని భావించడంవల్లే రివ్యూకు మొగ్గినట్లు వివరించాడు. ఇకపై మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఈ ఉదంతం చెబుతోందని పేర్కొన్నాడు.   

Advertisement
 
Advertisement
Advertisement